కేజీయఫ్ 2కు భారీ డీల్
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది సినిమాలకు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో బాహులి ముందు వరుసలో ఉంటే ఆ క్రేజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లిన సినిమా కేజీయఫ్ చాప్టర్ 1. ఇప్పుడు కేజీయఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనాటాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కరోనా ప్రభావంతో తుది దశ షూటింగ్ ఆగింది.
అయితే సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజా సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకు భారీ డిజిటల్ డీల్ వచ్చిందట. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ వెర్షన్స్ అన్నింటికీ కలిపి ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైజ్ రూ.55 కోట్ల డీల్ ప్రపోజల్‌ను పెట్టిందట. అయితే ఈ వ్యవహారంపై నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అంటున్నారు. మరి రాఖీభాయ్‌గా యష్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది విడుదల చేస్తారో లేక వచ్చే ఏడాది విడుదల చేస్తారో తెలియాలంటే వేచి చూడక తప్పేలా లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com