ఆ భారీ చిత్రం ఆగిపోయిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సినిమాతో తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా స్టాండర్డ్ ప్రపంచ స్థాయికి పెరిగింది. ఈ సినిమా స్ఫూర్తితో కోలీవుడ్ దర్శకుడు సుందర్.సి. దర్శకత్వంలో శృతిహాసన్ టైటిల్ పాత్రలో ఆర్య, జయం రవి ముఖ్యా పాత్రధారులుగా 250 కోట్ల బడ్జెట్‌తో సంఘమిత్ర అనే సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా రోజుల పాటు జరిగింది. శృతిహాసన్ సినిమాలో పాత్ర కోసం కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ తదితర అంశాలను నేర్చుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో సినిమా ఆగిపోయినట్లు వార్తలు వినపడుతున్నాయి.
సంఘమిత్ర సినిమాకు ప్రారంభం నుండే చాలా అడ్డంకులు ఏర్పడుతూ వచ్చాయి. ముందు సినిమా నుండి శృతిహాసన్ తప్పుకుంది. తర్వాత టైటిల్ రోల్‌కు హన్సికను తీసుకోవాలని అనుకున్నారు. కానీ చివరకు హన్సిక కూడా తాను సంఘమిత్రలో చేయడం లేదని ప్రకటించారు. అసలు ఈ సినిమాలో టైటిల్ పాత్రలో ఏ హీరోయిన్ చేస్తుందోనని అందరూ అనుకుంటున్న తరుణంలో సుందర్.సి సంతానం హీరోగా కలగళపు సినిమా సీక్వెల్ చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీంతో సంఘమిత్ర సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనని అందరూ అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments