బ్రహ్మాస్త ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. నిరాశలో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్, కారణమిదేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున కూడా కీలకపాత్రలు పోషించడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ మూవీకి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది చిత్రయూనిట్. ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నారు.
పోలీసుల అనుమతి నిరాకరణ ఎందుకు :
దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని రామోజీ ఫిలింసిటీలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ వస్తుండటంతో హైప్ నెలకొంది. అయితే... అనుకోని కారణాల వల్ల ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వనట్లుగా తెలుస్తోంది.
పార్క్ హయత్‌లో ప్రెస్ మీట్‌తో సరి:
అయితే ఈవెంట్ రద్దు కావడం వెనుక మరికొన్ని కారణాలు వున్నాయంటూ ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో వున్న సదుపాయాలు, అభిమానులను కట్టడి చేసే విషయంలో పోలీసులకు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు మధ్య వివాదం రేగడంతోనే పోలీసు అధికారులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతిని నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు.. కార్యక్రమం రద్దయిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రెస్ మీట్నిర్వహించే అవకాశం వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments