కరోనాతో షూటింగ్‌కు బిగ్‌బాస్ బ్యూటీ.. కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ వచ్చి ఏడాది గడిచినా దాని ప్రభావం మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ విపరీతంగా నష్టపోయింది. ఈ మధ్యనే సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బిగ్‌బాస్ బ్యూటీ ఒకరు తనకు కరోనా సోకిన విషయాన్ని దాచి షూటింగ్‌కు హాజరైంది. విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ షాక్ అయింది.
హిందీ బిగ్ బాస్ 7 విన్నర్, బాలీవుడ్ హీరోయిన్ గౌహర్ ఖాన్ చేసిన నిర్వాకమిది. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రభుత్వ నియమాల ప్రకారం కరోనా వచ్చిన వ్యక్తులు 14 రోజుల పాటు ఎవ్వరినీ కలవకూడదు. ఆసుపత్రిలోనో లేదంటే హోం క్వారంటైన్‌లోనో ఉండి చికిత్స తీసుకోవాలి. కానీ గౌహర్ ఖాన్‌కు అవేమీ పట్టలేదు. నేరుగా వెళ్లి షూటింగ్‌లో పాల్గొంది. డాక్టర్ల సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా గౌహర్ ఖాన్ సినిమా షూటింగ్‌లో పాల్గొందని బీఎంసీ అధికారి ఒకరు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
విషయాన్ని బీఎంసీ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా బాగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌ను చూసిన పౌరసంఘం కూడా ట్వీట్ చేసింది. కోవిడ్ నిబంధనలు అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. అన్ని మార్గదర్శకాలను అనుసరించాలని.. నగర భద్రత కోసం ఎక్కడా రాజీ పడేది లేదు అంటూ చెప్పుకోచ్చారు. ప్రస్తుతం గౌహర్ ఖాన్ అజ్ఞాతంలో ఉంది. ఆమె కోసం పోలీసులు వెతుకున్నారు. తొందర్లోనే గౌహర్ ఖాన్‌ను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com