ప్రభాస్ 21లో బిగ్ బి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్యాన్ ఇండియా స్టార్ పభాస్ 21వ సినిమా రేంజ్ పెరుగుతూ వస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మాతగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తానని నాగ్ అశ్విన్ ప్రారంభంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగా సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్స్ అందరినీ ఒకచోట చేరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఏ పాత్ర చేస్తారనే దానిపై క్లారిటీగా చెప్పలేదు కానీ.. అమితాబ్ రోల్ సినిమా అంతా ఉంటుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ "దివంగత ఎన్టీఆర్‌గారికి అమితాబ్ బచ్చన్‌గారంటే ఎంతో ఇష్టం. బాలీవుడ్ హిట్ రీమేక్స్‌లోనూ ఆయన నటించారు. ఆయనకు సంబంధించిన రామకృష్ణ థియేటర్లో 'షోలే' మూవీ ప్రదర్శితమవుతున్నప్పుడు నేను, ఎన్టీఆర్‌గారు చాలాసార్లు, ఆ సినిమాను చూశాం. ఇన్నేళ్ల తర్వాత మా వైజయంతీ మూవీస్‌లో ప్రెస్టీజియస్‌గా రూపొందుతోన్న సినిమాలో అమితాబ్‌గారు నటిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది" అఅన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ "అమితాబ్ బచ్చన్‌గారు మా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు నాకెంతో సంతోషంగా, ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఆయన పాత్ర సినిమా ఆసాంతం ఉంటుంది. ఆయనైతేనే ఆ పాత్రకు న్యాయం చేస్తారనిపించింది" అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments