Amitabh Bachchan:షెహన్‌షా ఈజ్ బ్యాక్ : గాయం నుంచి కోలుకున్న అమితాబ్.. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా బిగ్‌బి

  • IndiaGlitz, [Tuesday,March 21 2023]

ఇటీవల సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన కోసం ప్రార్ధించిన వారికి అమితాబ్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పారు. ఈ మేరకు బిగ్‌బీ ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో ఆయన బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. దీనిపై బిగ్‌బీ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు.

ప్రాజెక్ట్ షూటింగ్‌లో గాయపడ్డ అమితాబ్ :

కాగా.. ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ప్రాజెక్ట్ కే’’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తుండగా బిగ్ బీ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో పక్కటెముక మృదలాస్థి విరగడంతో పాటు కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ తన బ్లాగర్ ద్వారా వెల్లడించారు. దీంతో షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు బిగ్‌బీ వెల్లడించారు. షూటింగ్‌లు, ఇతర పనులను వాయిదా వేసి ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నానని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.

2024 సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే :

ఇకపోతే.. ప్రాజెక్ట్‌కే ను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వీనిదత్ భారీ బడ్జెట్‌తో ప్రాజెక్ట్ కేను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, దీపీకా పదుకొనే, దిశా పటానీ తదితర స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించని కొత్త కథతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రాజెక్ట్‌ను రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. తొలి భాగాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.