విజయానికి ఆరు ఓట్ల దూరంలో బైడెన్...

  • IndiaGlitz, [Thursday,November 05 2020]

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీకి తెరపడే సమయం ఆసన్నమవుతోంది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహించనున్నారన్న ఉత్కంఠ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. కాగా.. విజయావకాశాలు దాదాపు బైడెన్‌కే ఉన్నట్టు ఇప్పటి వరకూ పూర్తయిన ఓట్ల లెక్కింపును బట్టి తెలుస్తోంది. స్వింగ్ స్టేట్స్‌లో కీలకమైన విస్కిన్సన్, మిచిగాన్‌ రాష్ట్రాల్లో బైడెన్ విజయం సాధించడంతో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశం ఆయనకే లభించనున్నట్టు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు కావాల్సి ఉంది. కాగా.. ప్రస్తుతానికి బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా.. ట్రంప్ 214 ఓట్లను సాధించారు. బైడెన్ విజయానికి కేవలం ఆరు ఓట్ల దూరంలోనే ఉన్నారు. కాగా.. ప్రస్తుతం నెవెడా రాష్ట్రం కీలకంగా మారింది. నెవెడాలో ప్రస్తుతానికి 49.3శాతం ఓట్లతో బైడెన్ ఆధిక్యంలో ఉండగా... 48.7 శాతం ఓట్లతో ట్రంప్ కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం ఆరు ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బైడెన్ విజయం సాధిస్తే అధ్యక్ష పీఠం ఆయనదే అవుతుంది.

ఆది నుంచి గెలుపుపై ట్రంప్ ధీమాతో ఉన్నారు. ట్విట్టర్ వేదికగా.. మీడియాతో మాట్లాడుతూ.. కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాగా మొదటి నుంచి ట్రంప్ మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. కీలకమైన ఆరు రాష్ట్రాల్లో రీకౌంటింగ్‌కు ట్రంప్ డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. బ్యాలెట్ ఓట్లను పోలింగ్ తేదీ ముగిసిన తర్వాత కూడా అనుమతించడం దారుణమనేది ట్రంప్ ప్రధాన అభియోగం.

More News

మాదాపూర్ టు మియాపూర్.. మెట్రోలో ప్రయాణించిన పవన్

జనసేన అధ్యక్షులు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు మెట్రోలో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది.

బోరింగ్ టాస్క్.. విసుగు తెప్పించిన షో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్. ‘పల్లెకు పోదాం చలో చలో’.

అర్నబ్ అరెస్ట్.. సోషల్ మీడియా ఫైర్..

2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ చీఫ్ ఎడిటర్ అర్ణబ్‌ గోస్వామి అరెస్ట్ చేశారు.

మెగా డాటర్ నిహారిక వివాహ తేదీ ఫిక్స్...

కరోనా మహమ్మారి... ఇప్పట్లో కంట్రల్‌లోకి వచ్చే సూచనలైతే కనిపించట్లేదు. దీంతో టాలీవుడ్‌లో వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు.

కౌంటింగ్ ఆపేయండి.. సుప్రీంకోర్టుకు వెళతా: ట్రంప్

అమెరికా ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.