బైడెన్.. ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలివే..
- IndiaGlitz, [Wednesday,November 04 2020]
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ జరగడం విశేషం. కాగా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సైతం కొనసాగుతోంది. ముందుగా అంతా ఊహించినట్టుగానే.. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. క్షణక్షణానికి ఆధిక్యం మారిపోతోంది. జో బైడెన్‌కు 209, ట్రంప్‌కు 112 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అదే సమయంలో ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో ట్రంప్‌కు 50.5 శాతం, బైడెన్‌కు 48.2 శాతం ఓట్లు లభించాయి.
బైడెన్ గెలిచిన రాష్ట్రాలు: మసాచుసెట్స్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, డేలావర్, వర్జినియా, కనెక్టికట్, రోల్ ఐలాండ్, న్యూయార్క్, కొలరాడో, ఇల్లినాయిస్, న్యూ మెక్సికో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, న్యూ హ్యాంప్‌షైర్, ఒరెగాన్, కాలిఫోర్నియా, వాషింగ్టన్.
ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు: ఇండియానా, కెంటుకీ, ఓక్లహోమా, టేనస్సీ, వెస్ట్ వర్జీనియాల, మిస్సిసీపి, అలబామా, అర్కాన్సాస్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, లూసియానా, వ్యోమింగ్, మిస్సోరి, ఇదాహో, సౌత్ కరోలినా.
2020 US election results 10am (IST)#PresidentialElection #USElection #Biden2020 #Trump #Biden #elections #Elections2020 #Trump2020 @JoeBiden @realDonaldTrump pic.twitter.com/5hDElBMg5Q
— IndiaGlitz™ l తెలుగు (@igtelugu) November 4, 2020