75 రోజులు పూర్తి చేసుకున్న 'బిచ్చగాడు'
Send us your feedback to audioarticles@vaarta.com
బిచ్చగాడు సినిమా దండయాత్ర కొనసాగుతోంది. సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టిన బిచ్చగాడు 75 రోజులు కూడా దాటింది. 75 రోజులంటే ఐదో పదో థియేటర్లలో కాదు.. మొత్తం 200 థియేటర్లలో.. అవును.. ఏ స్టార్‌కీ తీసిపోని రీతిలో సుమారు 200 థియేటర్లలో 75 రోజులు పూర్తి చేసుకుంది బిచ్చగాడు. ఈ మధ్య కాలంలో 50 రోజులే గొప్ప అనుకుంటే.. ఏకంగా 100 రోజుల వైపు దూసుకెళుతోంది బిచ్చగాడు సినిమా.
బిచ్చగాడు రిలీజైనప్పటి నుంచి హిట్‌టాక్‌తో నడిచింది. మొదట్లో చాలా తక్కువ థియేటర్లల నుంచి క్రమంగా వందల థియేటర్లకు విస్తరించింది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా ఆంటోని నిర్మించిన చిత్రం 'పిచ్చైకారన్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో చదలవాడ తిరుపతిరావు సమర్పణలో మే 13న విడుదల చేశారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్నో సినిమాలు ఓ పక్క ప్రేక్షకులను నిరాశ పరుస్తుంటే, ఏ అంచనా లేని బిచ్చగాడు ఈ రేంజ్ హిట్ కొట్టడం మాటలు కాదు. బ్రహ్మోత్సవం, అ..ఆ.., కబాలి వంటి పెద్ద సినిమాల ధాటిని తట్టుకుని, తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరుచుకొంది బిచ్చగాడు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం పబ్లిక్ మౌత్‌టాక్‌తోనే పుంజుకుని హౌస్‌ఫుల్ కలెక్షన్లతో అదరగొడ్తోంది.
మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడాని బిచ్చగాడు సినిమా మరోసారి నిరూపించింది. విజయ్ ఆంటోనీ అద్భుతమైన నటన, దర్శకుడు శశి మేకింగ్ తీరుతో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఇంకా తల్లికొడుకుల సెంటిమెంట్‌తో ప్రేక్షకులను ఈ సినిమా భారీ స్థాయిలో ఆకట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com