25 కోట్ల 'బిచ్చగాడు'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం పిచ్చైకారన్` ను తెలుగులో బిచ్చగాడు` అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు. ఈ చిత్రం 63 రోజులను పూర్తి చేసుకుని దిగ్విజయంగా వందరోజుల వేడుకను జరుపుకునే దిశగా వెళుతుంది. ఆంద్రాలో 10,87,33,270/-, నైజాంలో 7,35,19,804/-, సీడెడ్ లో 6,85,67,673/ రూపాయలతో మొత్తంగా ఇప్పటికీ ఈ చిత్రం 25 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇంకా సినిమా 70 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతుందని ప్రేక్షకుల ఆదరణ ఇలాగే కొనసాగితే 30-35 కోట్ల రూపాయల వసూళ్లను సినిమా సాధిస్తుందని నిర్మాతలు తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com