'బిచ్చగాడు' వసూళ్లు 16కోట్లు

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం పిచ్చైకారన్' ను తెలుగులో బిచ్చగాడు' అనే పేరుతో మే 13న విడుదల చేసిన విషయం విదితమే.. ఆడియెన్స్ మౌత్ టాక్ తో స్లో గా స్టార్ట్ అయి నేటి వరకు స్డడీ గా వసూళను సాధిస్తూ భారీ విజయాన్ని అందుకుంది. 6వ వారంలో సైతం అన్ని ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటి వరకు 16కోట్ల వరకు వసూళ్లను రాబట్టి ట్రెడ్ వర్గాల వారిని ఆశ్చర్య పరిచింది. జులై 1కు యాభై రోజులను కంప్లీట్ చెసుకొనున్న బిచ్చగాడు 20కోట్ల క్లబ్ లొకి చెరనుందని టాక్.

మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి బిచ్చగాడు సినిమా మరోసారి నిరూపించింది. నిర్మాత చేసిన ప్రమోషన్స్ కూడా కలెక్షన్స్ ను ప్రభావితం చేశాయి . అన్నీ ఏరియాస్ లో ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందుకుంది.విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ సినిమాలో చక్కగా కుదిరాయి. ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు..!

More News

రామ్ స్టోరీ రివీల్ చేసిన క‌ట్ట‌ప్ప‌

నేను శైల‌జ సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తాజాగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

పట్టుదలే కారణం అంటున్నఅనుష్క బ్రదర్

సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...అనతి కాలంలోనే తన అందం,అభినయంతో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నబెంగుళూరు భామ అనుష్క.

జులై 7న A సర్టిఫికేట్ తో రష్మి గౌతమ్ 'అంతం' విడుదల

గుంటూరు టాకీస్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో యువతని కేరింతలు కొట్టించిన రష్మిగౌతమ్ ప్రదాన పాత్రలో నటించిన చిత్రం అంతం జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

గౌతమీపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ డీటైల్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ఓం నమో వెంకటేశాయ షూటింగ్ ప్రారంభించేది ఆరోజే..

కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-స్వరవాణి కీరవాణి ఈ ముగ్గురు కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఓం నమో వెంకటేశాయ.