చరిత్రను మార్చి రాస్తా..ఆకట్టుకుంటున్న "బిచ్చగాడు 2" థీమ్ సాంగ్

  • IndiaGlitz, [Wednesday,March 16 2022]

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది. తాజాగా బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ థీమ్ సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చింది.

ఈ థీమ్ సాంగ్ చూస్తే ...రోల్స్ రాయిస్ కారులో నుంచి స్టార్ హోటల్ దగ్గర దిగిన కథానాయకుడు అక్కడ బిచ్చగాడిలా మేకప్ వేసుకుంటాడు. ఆటోలో బయటకు వెళ్తాడు. అతను వెళ్తున్నది యాంటీ బికిలీ మిషన్ మీద అనేది తర్వాత తెలుస్తుంది. ఈ మిషన్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు అంటూ యాంటీ బికిలీ లక్ష్యమేంటో థీమ్ సాంగ్ లో చెప్పేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసంస్థాపనార్దయా సంభవామి యుగే యుగే శ్లోకం నేపథ్యంగా వినిపించింది ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ఆసక్తిరేపుతోంది.

దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత - ఫాతిమా విజయ్ ఆంటోనీ, బ్యానర్ - విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, రచన, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం - విజయ్ ఆంటోనీ.

More News

వృద్ధులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఆర్టీసీలో 60 ఏళ్లు దాటిన వారికి డిస్కౌంట్ : పేర్ని నాని ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ దృష్ట్యా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసీ నిలిపివేసిన 25 శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మన్ ప్రమాణ స్వీకారం.. పసుపు వర్ణమైన ఖట్కర్ కలన్

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్‌ మన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.

బెల్లంకొండ సురేష్.. శరణ్‌ల వివాదానికి శుభంకార్డ్: కేసు వాపసు, ఆపై క్షమాపణలు

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌, ఆయన తనయుడు సాయిశ్రీనివాస్‌కు ఫైనాన్షియర్‌ శరణ్ కుమార్‌ క్షమాపణలు తెలిపారు.

జగనన్న విద్యాదీవెన... విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు జమ చేసిన జగన్

‘జగనన్న విద్యాదీవెన’ పథకం నగదును తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌..

కోవిడ్‌పై పోరు.. ఇవాళ్టీ నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో భారతదేశం మరో ముందడుగు వేసింది.