‘బిచ్చగాడు 2’ ఫస్ట్‌లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన విజయ్ ఆంటోని.. హీరోగా,నిర్మాతగా నకిలీ’ సినిమాను నిర్మించారు. తొలి సినిమాతో మంచి హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ‘డాక్టర్ సలీమ్’ చిత్రంతోనూ తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ క్రమంలో విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బస్టర్ సాధించి తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అంతే కాదు.. విజయ్ ఆంటోని చిత్రాలకు ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ అయ్యింది.
‘భేతాళుడు, యముడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్’ వంటి వరుస సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈయన హీరో గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ‘జ్వాల’ సినిమా తెరకెక్కుతోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని తన కెరీర్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్ ‘బిచ్చగాడు 2’ను అనౌన్స్ చేసి ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియా కృష్ణస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఆంటోని ఈసినిమాను నిర్మిస్తున్నారు. 2021లో సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments