ఏ.వి.ఎం. మేకర్స్'బిచ్చగాడా..మజాకా'
Saturday, March 11, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో.. "ఆల్ వెరైటీ మూవీ మేకర్స్" పతాకంపై నూతన నిర్మాత బి.చంద్రశేఖర్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం "బిచ్చగాడా మజాకా..". అర్జున్-నేహాదేశ్ పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో.. సుమన్, బాబూమోహన్, బాలాజీ, రామసత్యనారాయణ, గౌతంరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత బి.చంద్రశేఖర్ ఈ చిత్రానికి కథ మరియు సంభాషణలు అందించడం విశేషం.
మూడు పాటలు, రెండు ఫైట్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసేందుకు ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో.. చిత్ర నిర్మాత బి.చంద్రశేఖర్, దర్శకులు కే.ఎస్.నాగేశ్వరరావు, హీరో అర్జున్, హీరోయిన్ నేహాదేశ్ పాండే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఎస్.కే.రహమాన్, ఎస్.ఎం.భాషా, కెమెరామెన్ అడుసుమిల్లి విజయ్ కుమార్, ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన బాలాజీ, గౌతంరాజు పాల్గొన్నారు.
"బిచ్చగాడా మజాకా" చిత్రం ద్వారా ఓ మంచి నిర్మాతను పరిశ్రమకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని చిత్ర దర్శకులు కే.ఎస్.నాగేశ్వరరావు పేర్కొనగా.. తాను తయారు చేసుకున్న కథను కే.ఎస్.నాగేశ్వరరావు అద్భుతంగా తెరకెక్కించారని.. అడుసుమిల్లి విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణ అని.. మే లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత బి.చంద్రశేఖర్ అన్నారు. "బిచ్చగాడా మజాకా" వంటి మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని హీరోహీరోయిన్స్ అర్జున్, నేహాదేశ్ పాండే చెప్పారు. ఈ సినిమాలో తాము చాలా మంచి పాత్రలు పోషించామని బాలాజీ, గౌతంరాజు తెలిపారు.
చిత్రం శ్రీను, చిట్టిబాబు, రాజశ్రీ నాయర్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: శ్రీవెంకట్, ఫైట్స్: రామ్ సుంకర, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, కో-డైరెక్టర్: రమేష్ రెడ్డి పూనూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎస్.కె.రహమాన్-ఎస్.ఎం.బాషా, కథ-మాటలు-నిర్మాత: బి.చంద్రశేఖర్, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.ఎస్.నాగేశ్వరరావు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments