యువకళావాహిని ఆధ్వర్యంలో 'బిచ్చగాడు' విజయాభినందన సభ

  • IndiaGlitz, [Thursday,June 30 2016]

తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ ఆంటోని, సత్న టైటస్‌ జంటగా ఫాతిమా ఆంటోని నిర్మించిన చిత్రం 'పిచ్చైకారన్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో చదలవాడ తిరుపతిరావు సమర్పణలో మే 13న విడుదల చేశారు. రిలీజైనప్పటి నుంచి హిట్‌టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతూ 50 రోజులను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా బుధవారం యువ కళావాహిని ఆధ్వర్యంలో విజయాభినందన సభను ఏర్పాటుచేశారు.

సమర్పకుడు చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ - ''చాలా సంవత్సరాల తర్వాత మా బ్యానర్‌లో ఇలాంటి ఓ మంచి సినిమా వచ్చి ఇంత పెద్ద సక్సెస్‌ కావడం హ్యాపీగా వుంది. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణగా నిలిచింది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ - ''బిచ్చగాడు'లాంటి చిత్రాన్ని చూస్తే సొసైటీ కొంతైనా బాగుపడుతుంది. తల్లి ప్రేమకోసం కొడుకు పడే తపన కలచివేస్తుంది. ఎడిటింగ్‌ అద్భుతంగా ఉంది. ఇలాంటి చిత్రాన్ని తీసిన నిర్మాతను అభినందిస్తున్నాను'' అన్నారు.

జె. బాపురెడ్డి మాట్లాడుతూ - ''గొప్ప అనుభూతితో పాటు గొప్ప మెసేజ్‌ ఇచ్చిన సినిమా 'బిచ్చగాడు'. ఈ పాత్ర చిరస్ధాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి మంచి చిత్రాలు స్ఫూర్తిగా నిలిచిపోతాయి'' అన్నారు.

జి.సత్యవాణి మాట్లాడుతూ - ''సినిమా అద్భుతంగా ఉంది. 'శంకరాభరణం' తర్వాత ఒక మంచి సినిమా చూశాననే తృప్తి కలిగింది. అన్ని కోణాల్లో మంచి సందేశం ఉన్న సినిమా ఇది'' అన్నారు.

హరినాధరావు మాట్లాడుతూ - ''బిచ్చగాడు' అనువాద చిత్రమైనప్పటికీ చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు పంథాలో ఉండి అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది . అమ్మ కోసం బిడ్డ పడే తపనను తెలియచేసే ఈ చిత్రం వంద రోజుల వేడుక జరుపుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ - ''మానవ సంబంధాలను సమాజంలో వ్యక్తి బాధ్యతలను తెలియచేసే చిత్రమిది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను'' అన్నారు.

జీడిగుంట రామచంద్ర మాట్లాడుతూ - ''సునిశితమైన మెసేజ్‌ ఉన్న చిత్రమిది. అన్ని పాత్రలు కథకు తగ్గట్టుగా సరిపోయాయి. ప్రతి సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి'' అన్నారు.

శరత్‌జ్యోత్స్న మాట్లాడుతూ - ''వైవిద్యభరితమైన కథను సినిమాగా మలిచారు. సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు'' అన్నారు.

కె.బి. లక్ష్మి మాట్లాడుతూ - ''సైంటిఫిక్‌గా ఆలోచించి అందరి సందేహాలను తీర్చే సినిమా ఇది. ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను'' అన్నారు.

శోభ మాట్లాడుతూ - ''మూడు వందల మందిలో ఒక వ్యక్తి బిచ్చగాడుగా మారిపోతున్నాడని ఒక సర్వే చెబుతోంది. అందుకు కారణాలు అనేకం. మంచి సామాజిక స్పృహ ఉన్న చిత్రమిది. మానవీయ కోణంలో తెరకెక్కించిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను'' అన్నారు.

సత్య మాట్లాడుతూ - ''తెలుగు ప్రేక్షకులు సినిమాని ఇంతగా ఆదరిస్తారని ఊహించలేదు. మంచి చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనడానికి ఇదొక ఉదాహరణ'' అన్నారు.

సుధామ మాట్లాడుతూ - ''తమిళ చిత్రమైనా తమిళ వాసన ఎక్కడా లేకుండా తెలుగు నేటివిటీకి తగిన విధంగా అద్భుతంగా తెరకెక్కించారు. భాషాశ్రీ అద్భుతమైన డైలాగ్స్‌ను రాశారు'' అన్నారు.

కె.వి. కృష్ణకుమారి మాట్లాడుతూ - ''ప్రతి ఫ్యామిలీలో అందరూ చూడదగ్గ చిత్రం. మానవీయ సంబంధాలు దూరమైపోతున్న ఈరోజుల్లో వాటిని మనకు గుర్తుతెచ్చేలా దర్శక నిర్మాతలు అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారు. వారి నిజమైన ప్రయత్నమే ఇప్పుడు సక్సెస్‌ రూపంలో నిలిచింది'' అన్నారు.

చిత్ర నిర్మాతలు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు శాలువాలతో సత్కరించారు.

More News

ఆటాడుకుందాం రా అంటూ పాటేసుకుంటున్న జంట..

కాళిదాసు, కరెంట్, అడ్డా... చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సుశాంత్. తాజాగా సుశాంత్ ఆటాడుకుందాం రా అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఆటాడుకుందాం రా అంటూ పాటేసుకుంటున్న జంట...

కాళిదాసు,కరెంట్,అడ్డా...చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సుశాంత్.

మెగాస్టార్ 150వ సినిమా డైలాగ్స్ లీక్..

ఈమధ్య స్టార్ హీరోలసినిమాలు షూటింగ్ లో ఉండగానే... ఆ సినిమాకు సంబంధించిన పాటలో...లేకపోతే కొన్ని సీన్సో... డైలాగులో లీకవ్వడం సర్వసాధారణం అయిపోయింది. బాహుబలి సినిమాలో వార్ సీన్ అలాగే లీకయ్యింది.

మళ్లీ అతనికే అవకాశం ఇస్తున్న పవన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.

రాజ్ తరుణ్ తో బాలీవుడ్ హీరోయిన్.....

ఉయ్యాలా జంపాలా నుండి ఈడోరకం ఆడోరకం వరకు వరుస విజయాలు సాధించిన యంగ్ హీరో రాజ్ తరుణ్