బిచ్చగాడు...30 లక్షల నుండి 13 కోట్లు...వారెవ్వా..
Send us your feedback to audioarticles@vaarta.com
కంటెంట్ ఉంటే కటౌట్ చాలు..సినిమా డైలాగే అయినా దేంట్లో అయినా విషయముంటే చాలు దూసుకెళ్లిపోవడం ఖాయం. ఈ విషయాన్ని బిచ్చగాడు సినిమా నిరూపించింది. తెలుగు ప్రేక్షకులకు సినిమా బావుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాను పెద్ద హిట్ చేస్తారనడానికి మరో నిదర్శనం కూడా బిచ్చగాడు సినిమాయే.
రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం పిచ్చైకారన్` ను తెలుగులో బిచ్చగాడు` అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు. నిజానికి ఈ చిత్రాన్ని నిర్మాతలు ముప్పై లక్షలు ఖర్చుపెట్టి డబ్బింగ్ రైట్స్ కొని విడుదల చేసి సైలెంట్ అయిపోయారు. కానీ సినిమా జనాలకు విపరీతంగా నచ్చడంతో సినిమా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. సాధారణంగా కాదు..ఎవరినోట విన్నా బిచ్చగాడు సినిమా బావుందనే అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో టైటిల్ లోని ట్యాగ్ లైన్ కు తగిన విధంగా కోట్ల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టి విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే మాతృక తమిళంలో కూడా సినిమా హిట్టయ్యింది కానీ తెలుగులో సాధించినంత పెద్ద సక్సెస్ సాధించలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తెలుగులో ఈ చిత్రం ఏకంగా 13 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. బిచ్చగాడా... మజాకా..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com