Bhuvaneshwari:భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. డీప్ ఫేక్ అంటూ టీడీపీ ఫైర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం హోరెత్తుతోంది. ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి పోటాపోటీ సభలు పెడుతూ మాటల తూటాలు పేలుస్తున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయాలు వేడెక్కుస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. దళితులను పచ్చి బూతులు మాట్లాడినట్టుగా ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"నేను నీకంటే పెద్దింట్లో పుట్టిన దాన్ని.. మీరు చెత్త బుట్టలో పుట్టారు.. అయినా వేషాలు వేస్తున్నారు.. దేనికి పనికిరాని అడుక్కుతినే వెధవల్లారా అంటూ... నానా బూతులు తిడుతోంది భువనేశ్వరి. నేను మీ అందరిని మానిటరింగ్ చేస్తానా.. తప్పుడు నా కొడకా.. ఉడికం చేసే వెధవ.. పనికిరాని.. ల..కొడుకా.. ముష్టి నా కొడకా" అంటూ పచ్చి బూతులు ఉన్నాయి. దీంతో ఆమె మాటలపై దళితులు, వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓటమి భయంతో ఫేక్ ఆడియోలు తిప్పుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
భువనేశ్వరి పేరుతో తిరుగుతున్న ఆడియో క్లిప్ ఫేక్ అని చెబుతున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబు వీడియోను, తర్వాత సర్వేల పేరుతో కొన్ని ఛానళ్ల వీడియోలు తిప్పిన వైసీపీ బ్యాచ్ ఇప్పుడు భువనేశ్వరి ఆడియో పేరుతో కొత్త కుట్రకు తెరతీశారని టీడీపీ అధికారిక ట్వీట్ చేసింది. "మొన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఈటీవీ వీడియోతో ఫేక్, నేడు భువనేశ్వరి గారి ఆడియోని డీప్ ఫేక్ చేశారు. జగన్ రెడ్డి... భువనేశ్వరి అంటే ఎందుకు నీకు అంత కడుపు మంట ? అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావ్, ఇప్పుడు ఆమె ఆడియోని ఫేక్ చేసావ్. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని, ఓట్లు కోసం ఇంతగా దిగజారతావా ? ఏమి బ్రతుకు జగన్ నీది ? అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. దీంతో భువనేశ్వరి ఆడియో క్లిప్‌పై టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com