భూమిక‌.. ఈ చిత్రాల‌తో బ్రేక్ చేస్తుందా?

  • IndiaGlitz, [Tuesday,April 17 2018]

‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ వంటి ఘ‌న‌విజ‌యాల‌తో స్టార్‌డ‌మ్‌ను పొందిన‌ కథానాయిక భూమిక చావ్లా. ‘మిస్సమ్మ’, ‘అనసూయ’ వంటి నాయికా ప్రాధాన్యమున్న సినిమాల్లో కూడా న‌టించి క‌థానాయిక‌గా తనదైన ముద్ర వేసారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని కొంత కాలం తెలుగు పరిశ్రమకు దూరమైన భూమిక..  తాజాగా నాని హీరోగా నటించిన ‘ఎం.సి.ఎ’తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో నానికి వదిన పాత్రలో చాలా హుందాగా నటించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగ చైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’లో నటిస్తున్నారు ఈ సీనియ‌ర్ హీరోయిన్‌. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో చైతుకి అక్క పాత్రలో భూమిక కనిపించనున్నారు. అంతేగాకుండా.. సమంత ప్రధాన పాత్రలో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘యు టర్న్’ సినిమాలో కూడా భూమిక ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

అంటే.. ప్ర‌స్తుతం భూమిక చేస్తున్న రెండు సినిమాలు కూడా అక్కినేని కుటుంబానికి చెందిన న‌టుల సినిమాలేన‌న్న‌మాట‌. ఇక్క‌డ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. భూమికకు, అక్కినేని కుటుంబానికి మంచి అనుబంధ‌మే ఉంది.  భూమిక తొలి చిత్రమైన‌ ‘యువకుడు’లో సుమంత్ హీరో కాగా.. నాగార్జున నిర్మించారు. అలాగే.. నాగార్జునకు జంటగా ‘స్నేహమంటే ఇదేరా’లో నటించారు భూమిక. అయితే.. అక్కినేని కుటుంబంతో కలిసి నటించిన ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. ఈ నేప‌థ్యంలో.. గతంలో రెండుసార్లు కూడా అక్కినేని కుటుంబానికి కలిసిరాని భూమిక.. ప్రస్తుతం  చేస్తున్న సినిమాలతో తన నెగెటివ్ సెంటిమెంట్‌ను అధిగ‌మిస్తారేమో చూడాలి.

More News

'భరత్‌ అనే నేను' సెన్సార్‌ పూర్తి, ఏప్రిల్‌ 20 విడుదల

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో

'నా..నువ్వే' పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి

కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణం లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణ లో, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,

ఏప్రిల్ 22న మిలట్రీ మాధవరంలో 'నా పేరు సూర్య' ఆడియో రిలీజ్

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో

బెన‌ర్జీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన చిరంజీవి

సినీ న‌టుడు బెన‌ర్జీ తండ్రి, న‌టుడు రాఘ‌వ‌య్య ఆదివారం ఉద‌యం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

అప్పుడు అల్లు అర్జున్‌.. ఇప్పుడు మ‌హేష్ బాబు

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. ఇప్ప‌టివ‌ర‌కు ఏడు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.