జనసేనలో చేరికపై భూమా అఖిల స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీపై తిరుగుబాటు చేస్తున్న భూమా కుటుంబం త్వరలోనే జనసేనలో చేరుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా టీవీలు, వార్తా పత్రికల్లో పదే పదే కథనాలు వస్తున్నా మంత్రి భూమా అఖిల ప్రియ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, ఇటీవల భూమా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫొటోలు కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎట్టకేలకు అఖిల స్పందించి క్లారిటీ ఇచ్చేశారు.
అంత ఖర్మ మాకేంటి..
శనివారం మధ్యాహ్నం ఓ కార్యక్రమంలో మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ.. టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. అసలు పార్టీకి దూరం కావాల్సిన అవసరం మాకేంటని మీడియానే ఆమె ఎదురు ప్రశ్నించారు.! జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని.. టీడీపీని వీడి జనసేనలో చేరాల్సిన ఖర్మ మా ఫ్యామిలీకి పట్టలేదన్నారు. మా నియోజకవర్గం అభివృద్ధికి అడిగినన్ని నిధులను చంద్రబాబు ఇస్తున్నారని.. అలాంటి బాబుకు తామెందుకు దూరమవుతామన్నారు. అయితే పోలీసులు తన అనుచరులు, కార్యకర్తలను వేధిస్తున్నారనే గన్‌మెన్లను దూరంగా పెట్టానని మరోసారి అఖిల అదే మాట చెప్పారు. ఈ వివాదం ఇప్పటికే సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకెళ్లానని ఆయనే పరిష్కరిస్తారన్నట్లుగా మంత్రి చెప్పుకొచ్చారు.
ఆళ్లగడ్డ నుంచే పోటీ చేస్తా..
అఖిల జనసేనలోకి వెళితే ఆ సీటు ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిదేనని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అఖిల తాజా స్పందనతో అన్ని పుకార్లకుఫుల్ స్టాప్ పెట్టినట్లైంది. కాగా రానున్న ఎన్నికల్లో తాను ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని.. భారీ మెజార్టీతో గెలిచి ఆ విజయాన్ని మా అధినేత చంద్రబాబుకు కానుకగా ఇస్తామని అఖిల స్పష్టం చేశారు.
అఖిల తాజాగా ఇచ్చిన క్లారిటీతో అసంతృప్తితో ఉన్న అభిమానులు, అనుచరులు, కార్యకర్తల అనుమానాలన్నీ పటాపంచులయ్యాయని చెప్పుకోవచ్చు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తి రగిలిపోతున్న అభిమానులు తాజా ప్రకటనతో ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే ఇక మిగిలిందల్లా నంద్యాల టికెట్ విషయమే. ఇప్పటికే పలువురు నేతల ఈ టికెట్ మా అల్లుడికే.. చంద్రబాబు టికెట్ ఇస్తారు కచ్చితంగా గెలుస్తామని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.. అయితే ఆ సీటు సంగతేంటో తేలిస్తే భూమా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని అభిమానులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout