Bhoothaddham Bhaskar Narayana:మార్చి 31న 'భూతద్ధం భాస్కర్ నారాయణ' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి చిత్రాల్లో నటిస్తూ తనకంటూ నటుడుగా పేరుగాంచిన శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా వెల్ టాలెంట్‌డ్ దర్శకడు పురుషోత్తం రాజ్ ని తొలిసారి గా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మించిన చిత్రమే "భూతద్ధం భాస్కర్ నారాయణ".
ఈ చిత్రం యొక్క మొదటిలుక్ నుండి రీసెంట్ గా విడుదల చేసిన మొషన్ పోస్టర్ వరకూ సినిమా కాన్సెప్ట్ ని ఇన్‌సర్ట్ చేసి వైవిధ్యం గా ప్రెజెంటేషన్ చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంభందించిన ప్రతి ప్రమోషన్ మెటీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని మార్చి 31, 2023 న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీనికి కూడా చిన్న మోషన్ పోస్టర్ తో డేట్ ఎనౌన్స్ చేస్తారు.
మార్చి 31న ఈ చిత్రం విడుదల చేయనున్న భూతద్దం భాస్కర్‌నారాయణ ధియేటర్ కి వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ గా ఈచిత్రం వుంటుంది. ఈ చిత్రం లో ఏ సన్నివేశాన్ని ముందుగా ఊహించడం చాలా కష్టం గా వుండేలా దర్శకుడు స్క్రీన్‌ప్లే వుంటుంది. ఈ చిత్రానికి సంభందించి మరిన్ని అప్‌డేట్స్ సంక్రాంతి సీజన్ తరువాత ప్రేక్షకులకి అందిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, అరుణ్, దేవీప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్, కమల్, గురురాజ్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments