Bhoothaddham Bhaskar Narayana:మార్చి 31న 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ' విడుద‌ల‌

  • IndiaGlitz, [Wednesday,January 11 2023]

మంచి చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ నటుడుగా పేరుగాంచిన శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా వెల్ టాలెంట్‌డ్ ద‌ర్శ‌క‌డు పురుషోత్తం రాజ్‌ ని తొలిసారి గా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మించిన చిత్రమే భూతద్ధం భాస్కర్‌ నారాయణ.

ఈ చిత్రం యొక్క మొద‌టిలుక్ నుండి రీసెంట్ గా విడుద‌ల చేసిన మొష‌న్ పోస్ట‌ర్ వ‌ర‌కూ సినిమా కాన్సెప్ట్ ని ఇన్‌స‌ర్ట్ చేసి వైవిధ్యం గా ప్రెజెంటేష‌న్ చేశారు నిర్మాత‌లు. ఈ చిత్రానికి సంభందించిన ప్ర‌తి ప్ర‌మోష‌న్ మెటీరియ‌ల్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని మార్చి 31, 2023 న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. దీనికి కూడా చిన్న మోషన్ పోస్ట‌ర్ తో డేట్ ఎనౌన్స్ చేస్తారు.

మార్చి 31న ఈ చిత్రం విడుద‌ల చేయ‌నున్న భూత‌ద్దం భాస్క‌ర్‌నారాయ‌ణ ధియేట‌ర్ కి వ‌చ్చిన ప్ర‌తి ప్రేక్ష‌కులకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ గా ఈచిత్రం వుంటుంది. ఈ చిత్రం లో ఏ స‌న్నివేశాన్ని ముందుగా ఊహించడం చాలా క‌ష్టం గా వుండేలా ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లే వుంటుంది. ఈ చిత్రానికి సంభందించి మ‌రిన్ని అప్‌డేట్స్ సంక్రాంతి సీజ‌న్ తరువాత ప్రేక్ష‌కుల‌కి అందిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జ‌రుగుతున్నాయి.

నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్‌, అరుణ్‌, దేవీప్రసాద్‌, వర్షిణి, శివకుమార్‌, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్‌ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్‌, కమల్‌, గురురాజ్‌ తదితరులు

More News

Golden Globe: టాలీవుడ్‌‌ను మరో మెట్టెక్కించిన ఆర్ఆర్ఆర్‌.. నాటు నాటు సాంగ్‌కు 'గోల్డెన్ గ్లోబ్'

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సోదరుడు

Chiranjeevi - Pawan: తమ్ముడేమో అలా.. అన్నయ్యేమో ఇలా , చిరంజీవి తీరుపై పవన్ అభిమానుల గుస్సా

మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు. టాలీవుడ్‌లో అగ్ర కథానాయకులుగా

Benefit Show: ‘‘మైత్రి’’కి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్

నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాల ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం

Somesh Kumar: సోమేష్ కుమార్‌కు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ నుంచి రిలీవ్, ఏపీకి వెళ్లాలని ఆదేశం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.

Tarakaratna- Nara Lokesh:నందమూరి తారకరత్న, నారా లోకేష్ ల బేటీ..?

తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్, నందమూరి తారకరత్న ఈ రోజు మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు.