విలనిజాన్ని చూపించబోతున్న భూమిక
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఖుషీలో నటించిన భూమిక చావ్లా హీరోయిన్గా స్టార్ హీరోలతో నటించింది. అదే సమయంలో నిర్మాతగా మారింది. తర్వాత ఎందుకనో సినిమాలకు దూరమైంది. ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. నాని ఎంసీఏ చిత్రంలో నాని వదిన పాత్రలో నటించి మెప్పించిన భూమిక తర్వాత రూలర్ చిత్రంలోనూ నటించింది. అడపాదడపా పాత్రలను అందిపుచ్చుకుంటున్న భూమిక ఇప్పుడు నెగెటివ్ టచ్ ఉన్నపాత్రలో నటించనుంది.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో భూమిక చెప్పుకొచ్చింది. మిస్సమ్మ చిత్రంలో తాను పోషించిన పాత్రలో కొద్ది మేరకు గ్రే షేడ్స్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాను చేయబోతున్న సినిమాలో పూర్తిస్థాయి విలనిజాన్ని చూపించబోతున్నట్లు తెలిపింది. అయితే తాను ఏ సినిమాలో ఆ పాత్రను చేస్తున్నాననే సంగతి మాత్రం ఇప్పుడే చెప్పలేను అంటూ భూమిక చెప్పుకొచ్చింది.
ప్రతి హీరోయిన్ డిఫరెంట్ పాత్రలు చేస్తుంటారు. ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా నటించిన పలువురు నెగెటివ్ టచ్‌లో నటించినవారే. వారి బాటలోనే ఇప్పుడు భూమిక చావ్లా నిలబడుతుందన్నమాట. మరి ఈమె ఏ సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించిందో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com