అయోధ్యలో భూమిపూజ.. రావణుడు పుట్టిన బిస్రాఖ్‌లో సైతం సంబరాలు
Send us your feedback to audioarticles@vaarta.com
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది. దేశ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల కల నేరవేరుతున్న సందర్భంగా దేశమంతటా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అయితే ఓ గ్రామం కూడా ఈ సంబరాలు జరుపుకోవడం విశేషం. స్వీట్స్ పంచుకుని మరీ సంబరాల్లో భాగస్వాములవుతున్నారు. దసరా నవరాత్రులు దేశమంతా జరుపుకుంటుంటే ఆ గ్రామంలో మాత్రం ఆ పది రోజులు సంతాప దినాలుగా పాటిస్తారు. అదే రావణుడి జన్మస్థలంగా భావించే బిస్రాఖ్ అనే కుగ్రామం.
ఇక్కడ రావణుడికి మందిరం ఉంది. అంతేకాదు.. పలువురి పూజలను సైతం రావణుడు నిత్యం అందుకుంటాడు. ఈ మందిరంలో శివ, పార్వతులతో పాటు కుబేరుల విగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఈ మందిరం ప్రత్యేకత ఏంటంటే రాత్రి వేళల్లో కూడా తెరిచే ఉంటుంది. అయితే ఇక్కడి రావణ మందిర పూజారి మహంత్ రామ్‌దాస్ మాట్లాడుతూ.. రాముడు లేకుంటే రావణుడు.. రావణుడు లేకుంటే రాముడూ లేడని.. అందుకే అయోధ్యలో భూమిపూజ సందర్భంగా తాము స్వీట్స్ పంచుకుంటున్నామని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments