close
Choose your channels

Bhola Shankar:మెగాస్టార్‌పై అభిమానం , GPSతో 'భోళా శంకర్‌'..  ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారి

Thursday, August 10, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘భోళా శంకర్’’. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేర్ వీరయ్యతో హిట్ కొట్టిన మెగాస్టార్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భోళా శంకర్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే విడుదల తేదీ ప్రకటించిన నాటి నుంచే అభిమానులు, సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. వూరూ వాడా చిరంజీవి ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేశారు. ఇటీవల మెగాస్టార్ అభిమానులు ఏకంగా 126 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. సూర్యాపేట - విజయవాడ జాతీయ రహదారిపై వున్న రాజుగారి తోట వద్ద దీనిని పెట్టారు. తెలుగు సినీ చరిత్రలో ఇంత వరకు ఏ హీరోకు ఇలాంటి కటౌట్ ఏర్పాటు చేయలేదని టాక్.

జీపీఎస్ ట్రాకింగ్‌తో చిరు ముఖ చిత్రం:

ఇదిలావుండగా.. ఈరోజు చిరు అభిమానులు, భోళా శంకర్ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం హైదరాబాద్ వీధుల్లో 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీనిలో ఏం ప్రత్యేకత వుందని మీరు అనుకోవచ్చు. సాదాసీదాగా చేస్తే వాళ్లు చిరు అభిమానులు ఎందుకు అవుతారు. జీపీఎస్ ట్రాకింగ్‌తో చిరంజీవి ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీని చేపట్టడం విశేషం. అంతేకాదు.. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఏ హీరోకు ఇలా ఉత్సవాలు చేయలేదని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలియజేసింది. ఇది భోళా శంకర్ సినిమా ప్రచారం కోసం కాదని.. చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఆయన గొప్పతనాన్ని చాటిచెబుతున్నామని పేర్కొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది.

రేపు ప్రేక్షకుల ముందుకు భోళా శంకర్ :

కాగా.. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రఘుబాబు, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిశోర్, సుశాంత్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment