ఈ నెల 29 న వైజాగ్ లో 'భీష్మ' విజయోత్సవ వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. కథానాయకుడు నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది ఈ చిత్రం. ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. వెంకీ కుడుముల దర్శకుడు.
ప్రపంచ వ్యాప్తంగా చిత్రం సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని వైభవంగా ఓ వేడుకను జరపాలని నిర్ణయించుకున్నారు చిత్ర యూనిట్. వాటి వివరాల్లోకి వెళితే...ఈ నెల 29 న వైజాగ్ లోని 'గురజాడ కళాకేత్రం' లో 'భీష్మ' చిత్ర విజయోత్సవ వేడుక ను నిర్వహించ నున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. హీరో నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన 'భీష్మ' వేడుకను, ఇంతటి ఘన విజయాన్ని తమకు అందించిన ప్రేక్షకాభిమానుల సమక్షంలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శనివారం( 29 ) సాయంత్రం వైజాగ్, వుడా కాంప్లెక్స్, సిరిపురం లోని 'గురజాడ కళాకేత్రం' లో 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ విజయోత్సవ వేడుకలో చిత్రకథానాయకుడు నితిన్, నాయిక రష్మిక మందన్న లతోపాటు చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. ఆరోజు జరిగే వేడుక ఆద్యంతం అభిమానులను అలరించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments