ఈ నెల 29 న వైజాగ్ లో 'భీష్మ'  విజయోత్సవ వేడుక

  • IndiaGlitz, [Thursday,February 27 2020]

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. కథానాయకుడు నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది ఈ చిత్రం. ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. వెంకీ కుడుముల దర్శకుడు.

ప్రపంచ వ్యాప్తంగా చిత్రం సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని వైభవంగా ఓ వేడుకను జరపాలని నిర్ణయించుకున్నారు చిత్ర యూనిట్. వాటి వివరాల్లోకి వెళితే...ఈ నెల 29 న వైజాగ్ లోని 'గురజాడ కళాకేత్రం' లో 'భీష్మ' చిత్ర విజయోత్సవ వేడుక ను నిర్వహించ నున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. హీరో నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన 'భీష్మ' వేడుకను, ఇంతటి ఘన విజయాన్ని తమకు అందించిన ప్రేక్షకాభిమానుల సమక్షంలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శనివారం( 29 ) సాయంత్రం వైజాగ్, వుడా కాంప్లెక్స్, సిరిపురం లోని 'గురజాడ కళాకేత్రం' లో 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ విజయోత్సవ వేడుకలో చిత్రకథానాయకుడు నితిన్, నాయిక రష్మిక మందన్న లతోపాటు చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. ఆరోజు జరిగే వేడుక ఆద్యంతం అభిమానులను అలరించనుంది.
 

More News

చిరంజీవి యువత నుంచి బండ్రెడ్డు ఔట్

ఇంటి దొంగలను పనిపట్టే పనిలో జనసేన సిద్ధమవుతోందని.. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలపాలు సాగించినా లీగల్‌ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని

ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేందుకు త్రినయని సీరియల్‌తో మీ ముందుకు వస్తోన్న జీ తెలుగు

అద్భుతమైన కథలు, అత్యద్భుతమైన సీరియల్స్‌, అంతకుమించిన రియాలిటీ షోస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని జీ తెలుగు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తోంది.

‘ఇండియ‌న్ 2’ ప్ర‌మాదంపై శంక‌ర్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు.

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంక‌ల్ప్‌

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు. ఇప్పుడు కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఓ భారీ యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు.

'త‌లైవి' డైరెక్ట‌ర్‌పై ర‌చ‌యిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `త‌లైవి`. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత