కలెక్షన్లలో దూసుకెళ్తున్న‘భీష్మ’...!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కుర్ర హీరో నితిన్, రష్మిక మందన్నా నటీనటులుగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ’ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీష్మ’ కలెక్షన్ల పరంగా గట్టిగానే దూసుకెళ్తున్నాడు. వాస్తవానికి సినిమా పోస్టర్లు, లుక్స్, టీజర్లతోనే అంచనాలు పెరిగిపోయాయ్.. అయితే.. ఈ సినిమాను చాలా సీరియస్‌గా తీసుకున్న నితిన్.. అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఈ చిత్రం రూ.6.30 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. రెండో రోజూ కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది రెండో రోజూ తెలుగు రాష్ట్రాల్లో రూ.4.20 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం సినిమాలేమీ లేకపోవడం భీష్మకు కలిసొచ్చింది. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ‘భీష్మ’ వసూలు చేసిన షేర్ మొత్తం రూ.10.50 కోట్లు.
రెండో రోజు కలెక్షన్స్ ఇలా..!
నైజాం - రూ. 4.1 కోట్లు
సీడెడ్ - రూ. 1.52 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 1.20 కోట్లు
గుంటూరు - రూ. 1.02 కోట్లు
తూర్పు గోదావరి - రూ. 92 లక్షలు
పశ్చిమ గోదావరి - రూ. 72 లక్షలు
నెల్లూరు - రూ. 37 లక్షలు
ఏపీ, టీఎస్ మొత్తం - రూ. 10.52 కోట్లు.
మొత్తానికి చూస్తే.. నితిన్ చాలా కాలం తరవాత ఒక మంచి హిట్ అందుకున్నాడని చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments