మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా నటించిన మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్‌లో జరగాల్సి వుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చఏశారు. అయితే ఏపీ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన మృతికి నివాళి అర్పిస్తూ భీమ్లానాయక్ ప్రీరిలీజ్ వేడుకను వాయిదా వేస్తున్నాం’ అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
p>
మేకపాటి గౌతం రెడ్డి భౌతికాయానికి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం గౌతంరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమల శాఖ మంత్రిగా మేకపాటి రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి హఠాన్మరణం.. రాష్ట్రానికి తీరనిలోటని, వ్యాపారంలో సంపాదించిన డబ్బును ప్రజాసేవకు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ విషాద సమయంలో ‘భీమ్లా నాయక్’ వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదని.. అందుకే నేడు జరగాల్సిన ప్రిరిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించామన్నారు.
ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com