రానా పుట్టినరోజు సందర్భంగా 'భీమ్లా నాయక్' నుంచి  డేనియల్ శేఖర్ మరో ప్రచార చిత్రం విడుదల

  • IndiaGlitz, [Tuesday,December 14 2021]

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి నేడు ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు చిత్ర బృందం. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా 'భీమ్లా నాయక్' నుంచి ఆయన పోషిస్తున్న డేనియల్ శేఖర్ పాత్ర కు సంబంధించినదే ఈ ప్రచార చిత్రం. ‘భీమ్లా నాయక్' పవన్ కళ్యాణ్ కూడా కనిపించే ఈ ప్రచార చిత్రాన్ని పరికిస్తే....

వాడు అరిస్తే భయపడతావా

ఆడికన్నా గట్టిగా అరవగలను

ఎవడాడు....

దీనమ్మ దిగొచ్చాడా...

ఆఫ్ట్రాల్ ఎస్ ఐ

సస్పెండెడ్.... అంటూ డేనియల్ శేఖర్ పాత్రధారి రానా ఆవేశంగా ఎవరితోనో చిత్ర కథానుసారం సంభాషించటాన్ని ఇందులో చూడవచ్చు. ఈ సన్నివేశం ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

‘భీమ్లా నాయక్‘ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

More News

‘బంగార్రాజు’ స్పెషల్ సాంగ్‌లో ఫరియా అబ్దుల్లా

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ

తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.

పీవీ నరసింహరావుపై వెబ్ సిరీస్.. తెరకెక్కించనున్న ప్రకాశ్ ఝా, ఆహాలో స్ట్రీమింగ్

తెలుగు జాతి సత్తాను , సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ పీవీ నరసింహారావు.

బిగ్‌బాస్ 5 తెలుగు: హౌస్‌లో స్వీట్ మెమొరీస్.. ఆ సర్‌ప్రైజ్‌కి శ్రీరామ్, మానస్ ఎమోషనల్

బిగ్‌బాస్ 5 తెలుగు 100వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.

ఆగ్రహంతో ఊగిపోయిన బన్నీ ఫ్యాన్స్.. నాగార్జున్ ‘‘ఎన్‌ కన్వెన్షన్‌’’పై దాడి, లాఠీఛార్జ్

భారతదేశంలో సినీతారలకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అభిమాన తారల్ని దైవంలా ఆరాధిస్తారు  ఫ్యాన్స్.