close
Choose your channels

పాటల విడుదల సన్నాహాల్లో భీమవరం టాకీస్ 'ఎఫైర్'

Saturday, August 22, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "ఎఫైర్". "ఇద్దరమ్మాయిల ప్రేమకథ"గా ప్రాచుర్యం పొందిన ఈ చిత్రం పాటలు త్వరలో విడుదల చేయనున్నారు. శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంతి, గీతాంజలి, ధనరాజ్, రాకేష్, సాయిరాజ్, షాని సాల్మోన్, ముఖ్యపాత్రధారులు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకొని సెన్సార్ కి సిద్ధమైన ఈ చిత్రం గురించి.

భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... "బాలీవుడ్ లో మహేష్ భట్ ఏక్తాకపూర్ వంటివారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసే బోల్డ్ సినిమాల నుంచి పొందిన స్ఫూర్తితో రూపొందిస్తున్న సినిమా "ఎఫైర్". ఈ సినిమా ఫస్ట్ లుక్ కు బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ గా శ్రీరాజన్ కి చాలా ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. బిజినెస్ పరంగా ఇప్పటికే చాలా మంచి క్రేజ్ తెచ్చుకొన్న ఈ చిత్రం ఆడియోను అతి త్వరలో విడుదల చేసి, వీలైనంత త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

పుచ్చా రామకృష్ణ, హరిణి, ఫణి, సంపత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, కెమెరా: కర్ణ ప్యారసాని, డైలాగ్స్: అనిల్, మ్యూజిక్: శేషు కె.ఎం.అర్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment