దర్శకుడు వేణు శ్రీరామ్ చేతుల మీదుగా "భీమదేవరపల్లి బ్రాంచి" ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
"భీమదేవరపల్లి బ్రాంచి " ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈరోజు విడుదల చేసాడు. వేణు శ్రీరామ్ మాట్లాడుతు ప్రేక్షకులు ప్రెసెంట్ ఇలాంటి రియలిస్టిక్ సినిమాలు ఇష్ట పడుతున్నారు.. దర్శకుడు రమేష్ చెప్పాల బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు... ఇలాంటి కథాంశాన్ని కామెడీ వేలో చెప్పడం వల్ల జనాలకి ఈజీగా సినిమా రీచ్ అవుతుందనీ దర్శకుడుకి "ఆల్ ది బెస్ట్"చెప్పాడు.
ఈ సినిమాను"Neorealism" ఉట్టిపడేలా "స్లైస్ ఆఫ్ లైఫ్" జానర్ లో రమేశ్ చెప్పాల చిత్రీకరించాడు. చెప్పాలనుకున్న కథలో సహజత్వం పోకూడదని, వెతికి వెతికి అనేకమంది టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్టులతో చేయడం వల్ల ఈ సినిమాకి సహజత్వంగా ఉంటుందని, స్క్రీన్ ప్లే రెండు గంటలు ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తుందని" దర్శకుడు చెప్పాడు.
ఇందులో నటినటులు: అంజి బాబు,రాజవ్వ,సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభి, రూప శ్రీనివాస్,శుభోదయం సుబ్బారావు, సి. ఎస్.ఆర్. వివ రెడ్డి,పద్మ, సాయి ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, కటారి, వరంగల్ భాష. వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. AB CINEMASS & NIHAL PRODUCTIONS నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల. నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి కెమెరా: కె.చిట్టి బాబు. సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి. పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే ఆర్ట్: మోహన్. పి ఆర్ ఓ: శ్రీధర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments