నటి భావనకు పెళ్ళి ఖరారైంది..

  • IndiaGlitz, [Thursday,May 04 2017]

తెలుగులో ఒంటిరి, మ‌హాత్మ సినిమాల‌ను చేసిన భావ‌న ఇటీవ‌ల కిడ్నాప్‌, లైంగిక వేధింపులు కార‌ణంగా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది. త‌ర్వాత ధైర్యంగా అంద‌రి బాస‌ట‌తో ముందుకు వ‌చ్చిన భావ‌న త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కానుంది. భావ‌న పెళ్లి తేదీ ఖ‌రారైంది. క‌న్న‌డ నిర్మాత న‌వీన్‌ను ఆమె అక్టోబ‌ర్ 27న పెళ్లి చేసుకోనుంది.

ఈ పెళ్లి మా సొంత ఊరు తిరుచ్చూరులో జ‌రుగుతుంది. అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య పెళ్లి చేద్దామ‌ని అనుకుంటున్నాం. సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి ఎవ‌రెవ‌రిని ఆహ్వానించాల‌నే విష‌యాన్ని మేమింకా నిర్ణ‌యించుకోలేదు. భావ‌న ఇష్ట‌ప్ర‌కారం పిలుస్తాం. ప్ర‌స్తుతం త‌ను స్విట్జ‌ర్లాండ్‌లో ఉంది. తిరిగి వ‌చ్చాక ఎవ‌రెవ‌రిని పిల‌వాలో ఆమె లిస్టు త‌యారు చేసుకుంటుందని త‌ల్లి పుష్ప అన్నారు.