పటేల్ సార్ తో భావన.....

  • IndiaGlitz, [Saturday,April 08 2017]

కిడ్నాప్‌, వేధింపుల‌కు గురైన మ‌ల‌యాళ న‌టి భావ‌న ఈ మ‌ధ్య కాలంలో వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యింది. తెలుగులో ఒక‌ప్పుడు ఒంట‌రి, మ‌హాత్మ సినిమాల్లో న‌టించి మెప్పించిన ఈ హీరోయిన్‌ను ఇప్పుడు తెలుగులో న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై జ‌గ‌ప‌తిబాబు టైటిల్‌రోల్‌లో ప్రారంభ‌మైన సినిమా 'పటేల్ S.I.R'. సినిమా షూటింగ్‌కంటే ముందే టీజ‌ర్ విడుద‌లై సెన్సేష‌న‌ల్ అయ్యింది.
ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ పాత్ర కోసం భావ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ఈ పాత్ర‌కు భావ‌న అయితే న్యాయం చేస్తుంద‌ని ద‌ర్శ‌కుడు వాసు ప‌రిమి భావించాడ‌ట‌. అయితే ఇంకా ఏదీ క‌న్‌ఫర్మ్ కాలేదు. త్వ‌ర‌లోనే ఈ విష‌య‌మై అధికార‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

More News

మహేష్ తో అల్లరోడు...

సూపర్ స్టార్ మహేష్ తో ఈ తరం కామెడి స్టార్ అల్లరి నరేష్ కలిసి పనిచేయబోతున్నాడట.ఎ.ఆర్.మురుగ దాస్ 'స్పైడర్'

మరోసారి హిట్ ఇచ్చిన దర్శకుడుతో చైతు...

అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

'మిస్టర్ ' మూవీ అన్నీ అందరినీ ఆకట్టుకునే సక్సెస్ ఫుల్ మూవీ అవుతుంది - మెగాస్టార్ చిరంజీవి

ముకుంద,కంచె,లోఫర్ వంటి డిఫరెంట్ చిత్రాల తర్వాత మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి),ఠాగూర్ మధు నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'మిస్టర్'.

'స్కెచ్' వేస్తున్న విక్రమ్

ఈ తరం విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కలైపులి థాను నిర్మాతగా వి క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'మిస్టర్' సెన్సార్ పూర్తి

వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి,హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ బ్యానర్పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్టర్`.