భావన ఎంగేజ్ మెంట్...

  • IndiaGlitz, [Friday,March 10 2017]

రీసెంట్‌గా కిడ్నాప్న్‌కు గురైన మ‌ల‌యాళ హీరోయిన్ భావ‌నకు ఎంగేజ్ మెంట్ అయ్యింది. రీసెంట్‌గా భావ‌న‌ను ఆమె మాజీ కారు డ్రైవ‌ర్ స‌హా కొంద‌రు దుండ‌గులు కిడ్నాప్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ వ్య‌వ‌హారం చాలా పెద్ద దుమారం రేపింది.

ప‌లువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ హీరోయిన్ ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు రావ‌డం ప‌ట్ల ప‌లువురు భావ‌నను అప్రిసియేట్ చేస్తున్నారు. ఈరోజు భావ‌న ఎంగేజ్‌మెంట్ అయ్యింది. త‌న భాయ్ ఫ్రెండ్, నిర్మాత అయిన న‌వీన్‌తో త‌న ఇంట్లో ప‌రిమితంగా హాజ‌రైన అతిథులు, బంధువులు స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది.