భాస్క‌ర్‌కు మ‌ళ్లీ అవ‌కాశం ఇస్తారా?

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

'బొమ్మ‌రిల్లు' సినిమాతో డైరెక్ట‌ర్ భాస్క‌ర్ పేరు మారు మోగిపోయింది. ఆ త‌ర్వాత భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'పరుగు' సినిమా కూడా మంచి విజ‌యాన్నే అందుకుంది. అయితే రామ్‌చ‌ర‌ణ్‌తో భాస్క‌ర్ చేసిన 'ఆరెంజ్' సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోర్లా ప‌డ‌టంతో భాస్క‌ర్ పేరు ఎంత మారు మోగిందో..అంతే రేంజ్‌లో ప‌డిపోయింది.

త‌ర్వాత రామ్‌తో భాస్క‌ర్ చేసిన 'ఒంగోలు గిత్త‌' చ‌తికిల ప‌డిపోయింది. దీంతో తెలుగులో భాస్క‌ర్ తెలుగులో క‌న‌ప‌డ‌లేదు. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత భాస్క‌ర్ తెలుగులో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని స‌మాచారం.

గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. ఈ సినిమాలో అల్లు శిరీష్ హీరోగా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

More News

మ‌ళ్లీ బిజీ అవుతున్న నిత్యా

నిత్యా మీన‌న్‌.. పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌లకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌క్షిణాది హీరోయిన్ పేరిది. సౌత్ లోని నాలుగు భాష‌ల్లోనూ న‌టిగా త‌న ప్ర‌తిభ‌ని చాటిన ఈ ముద్దుగుమ్మ‌.. తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.

'సాహో' బిజినెస్‌.. టాలీవుడ్ టాక్‌

ప్రభాస్ హీరోగా  తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైన‌ర్  'సాహో'.  శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేష్ విలన్ గా న‌టిస్తున్నాడు.

మోహన్ బాబు 'గాయత్రీ' షూటింగ్ లో విష్ణు మంచు, శ్రియ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రీ’ అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లోగోకు అనూహ్య స్పందన వచ్చింది.

జవాన్ ప్రీ రిలీజ్ టూర్ వివరాలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'సప్తగిరి ఎల్ ఎల్ బి' పెద్ద హిట్ అవుతుంది - రామ్ చరణ్

కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్ఎల్బి'.