30 శాతం రెమ్యునరేషన్ తగ్గించుకోండి: భారతీరాజా
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీ రాజా నటీనటులకు ఒక సూచన చేశారు. కరోనా కారణంగా తమిళ చిత్ర పరిశ్రమ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని.. కాబట్టి నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరారు. కరోనా కారణంగా తమిళ చిత్ర పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది రూ.10 లక్షల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వారికే వర్తించనుంది.
రూ. 10 లక్షల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నవారు, సాంకేతిక నిపుణులు 30 శాతం తగ్గించుకుంటేనే పరిశ్రమ మనుగడ సాగిస్తుందని భారతీరాజా పేర్కొన్నారు. నిర్మాతలు చిత్ర నిర్మాణం కోసం కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని తిరిగి రాబట్టలేక నానా ఆగచాట్లు పడుతున్నారన్నారు. ప్రొడక్షన్లో ఉండి, చిత్రీకరణ దశలో ఆగిపోయిన సినిమాల నిర్మాతలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత నటీనటులు, సాంకేతిక నిపుణులపై ఉందన్నారు.
ఇలా నటీనటులు, సాంకేతిక నిపుణులు 30 శాతం రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటే నిర్మాతకు సినిమాకు పెడుతున్న బడ్జెట్లో 40 శాతం ఖర్చు తగ్గుతుందన్నారు. ఇది నిర్మాతపై భారం తగ్గుతుందని తెలిపారు. ఇప్పటికే తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో 30 నుంచి 50 శాతం తగ్గించుకునేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. వారిని అనుసరించాలని సూచించారు. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల గురించే ఈ విన్నపం అని, భవిష్యత్తులో చేయబోయే చిత్రాల గురించి కాదని భారతీరాజా వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments