30 శాతం రెమ్యునరేషన్ తగ్గించుకోండి: భారతీరాజా

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీ రాజా నటీనటులకు ఒక సూచన చేశారు. కరోనా కారణంగా తమిళ చిత్ర పరిశ్రమ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని.. కాబట్టి నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరారు. కరోనా కారణంగా తమిళ చిత్ర పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది రూ.10 లక్షల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వారికే వర్తించనుంది.

రూ. 10 లక్షల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నవారు, సాంకేతిక నిపుణులు 30 శాతం తగ్గించుకుంటేనే పరిశ్రమ మనుగడ సాగిస్తుందని భారతీరాజా పేర్కొన్నారు. నిర్మాతలు చిత్ర నిర్మాణం కోసం కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని తిరిగి రాబట్టలేక నానా ఆగచాట్లు పడుతున్నారన్నారు. ప్రొడక్షన్‌లో ఉండి, చిత్రీకరణ దశలో ఆగిపోయిన సినిమాల నిర్మాతలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత నటీనటులు, సాంకేతిక నిపుణులపై ఉందన్నారు.

ఇలా నటీనటులు, సాంకేతిక నిపుణులు 30 శాతం రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటే నిర్మాతకు సినిమాకు పెడుతున్న బడ్జెట్‌లో 40 శాతం ఖర్చు తగ్గుతుందన్నారు. ఇది నిర్మాతపై భారం తగ్గుతుందని తెలిపారు. ఇప్పటికే తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో 30 నుంచి 50 శాతం తగ్గించుకునేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. వారిని అనుసరించాలని సూచించారు. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల గురించే ఈ విన్నపం అని, భవిష్యత్తులో చేయబోయే చిత్రాల గురించి కాదని భారతీరాజా వెల్లడించారు.

More News

వందేళ్లకోసారి మాత్రం ఇలాంటి వర్షం పడే అవకాశం: కేటీఆర్

1908లో మూసీకి వరదలు వచ్చాయని.. నాడు ఒకే రోజు 43 సెంటీమీటర్లు వర్షం పడిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఆ ట్వీట్‌ని బ్రహ్మాజీ ఎందుకు డిలీట్ చేశారు?

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. అభిమానుల ప్రశ్నలకు ఫన్నీ ఫన్నీగా సమాధానాలు ఇస్తూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు.

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభించిన శశి ప్రీతమ్‌, ఐశ్వర్య కృష్ణప్రియ

గాయనీ గాయకులను, బ్యాండ్స్‌ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌ సోమవారం నాడు ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ కాంపిటీషన్‌ ప్రారంభించారు.

నందమూరి బాలకృష్ణ 'నర్తనశాల' ఈ నెల 24న విడుదల

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా

ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్..

కరోనా వైరస్ కట్టడి కోసం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన చివరి దశ ప్రయోగాలను భారీ స్థాయిలో చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.