మోదీ రాకతో ఉద్విఘ్నం.. నినాదాలతో హోరెత్తించిన జవానులు
Send us your feedback to audioarticles@vaarta.com
లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ రాకతో అక్కడ కొంతసేపు ఉద్విఘ్న భరిత వాతావరణం నెలకొంది. మోదీ నీముకి చేరుకోగానే సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాలతో హోరెత్తించారు. భారత ఆర్మీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. కష్ట సమయంలో పోరాటం చేస్తున్నామని.. ఇది ఎంతో విలువైన పోరాటమన్నారు. భారత సేనలకు అవసరమైన ఆయుధాల విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు.
సరిహద్దుల వద్ద మౌలిక సదుపాయాల కోసం సైతం భారీగా నిధులు పెంచామన్నారు. వేల ఏళ్లుగా ఎన్నో దాడులను తిప్పి కొట్టామన్నారు. ఇక మీదట కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని మోదీ తెలిపారు. అమరులైన ప్రతి సైనికుడికి నివాళి ఘటిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమరులైన వీర జవానుల గురించి ప్రతి ఇంటా తెలిసిందన్నారు. దేశ ప్రజలందరి ఆశీస్సులు సైనికులకు మెండుగా ఉన్నాయని మోదీ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments