మోదీ రాకతో ఉద్విఘ్నం.. నినాదాలతో హోరెత్తించిన జవానులు

లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ రాకతో అక్కడ కొంతసేపు ఉద్విఘ్న భరిత వాతావరణం నెలకొంది. మోదీ నీముకి చేరుకోగానే సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాలతో హోరెత్తించారు. భారత ఆర్మీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. కష్ట సమయంలో పోరాటం చేస్తున్నామని.. ఇది ఎంతో విలువైన పోరాటమన్నారు. భారత సేనలకు అవసరమైన ఆయుధాల విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు.

సరిహద్దుల వద్ద మౌలిక సదుపాయాల కోసం సైతం భారీగా నిధులు పెంచామన్నారు. వేల ఏళ్లుగా ఎన్నో దాడులను తిప్పి కొట్టామన్నారు. ఇక మీదట కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని మోదీ తెలిపారు. అమరులైన ప్రతి సైనికుడికి నివాళి ఘటిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమరులైన వీర జవానుల గురించి ప్రతి ఇంటా తెలిసిందన్నారు. దేశ ప్రజలందరి ఆశీస్సులు సైనికులకు మెండుగా ఉన్నాయని మోదీ తెలిపారు.

More News

దేశంలో ఒక్కరోజే 20 వేలు దాటిన కరోనా కేసులు..

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్‌డౌన్ అనంతరం కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.

కరోనా అంతమైందంటూ పార్టీ.. వేలల్లో హాజరైన ప్రజలు

కరోనా కారణంగా ప్రపంచమే వణికిపోతుంటే.. ఓ దేశంలో మాత్రం ‘కరోనా వైరస్ పార్టీ’ పేరుతో పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం జరిగింది.

లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన

చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైన్యంలో ధైర్యాన్ని నింపేందుకు యత్నాలు జరుగుతున్నాయి.

గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్.. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్!

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నీ ఓకే అయితే కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.

ఢిల్లీకి వైసీపీ ఎంపీలు.. షాకిచ్చిన రఘురామ కృష్ణరాజు

ఎత్తులకు పై ఎత్తులతో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు..