'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్ అనే నేను' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను జనవరి 26న విడుదల చేశారు. ఉదయం 7 గంటలకు 'భరత్ అనే నేను' ఫస్ట్ ఓత్, 8 గంటలకు లోగో, 9 గంటలకు ఫస్ట్ లుక్ విడుదలైంది.
ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ '' ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు జరిగే ఫిక్షనల్ పొలిటికల్ డ్రామా ఇది. ఈ సినిమా ప్రమోషన్‌కి జనవరి 26 మంచి సందర్భం అని మేమంతా భావించి 'భరత్ అనే నేను' ఫస్ట్ ఓత్ పేరుతో ఉదయం 7 గంటలకు ఆడియోను రిలీజ్ చేశాం. ఇలాంటి కంటెంట్‌కి వీడియో కంటే ఆడియోను రిలీజ్ చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుందని మేమంతా భావించాం. అందుకే మహేష్‌బాబు వాయిస్‌తో ఫస్ట్ ఓత్‌ని రిలీజ్ చేయడంతో ప్రమోషన్ స్టార్ట్ చేశాం'' అన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ '' ఈరోజు ఉదయం విడుదల చేసిన 'భరత్ అనే నేను' ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. మహేష్‌గారితో కొరటాల శివ కాంబినేషన్లో ఇంత భారీ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బేనర్‌కి ఇది ఓ ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది'' అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్, హీరోయిన్ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్, ఎస్.తిరునవుక్కరసు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com