క్లైమాక్స్ పూర్తిచేసుకున్న 'భరత్ అనే నేను'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను`. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ను సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన శ్రీమంతుడు` సినిమా తర్వాత...మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. స్వతహాగా తన సినిమాకి సంబంధించి ఏ విషయమైనా చాలా ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు కొరటాల. అలా ప్రత్యేకంగా.. జనవరి 26న విడుదల చేసిన ఫస్ట్ ఓథ్ ఆడియో టీజర్ మహేష్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే..తాజాగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్స్‌కు సంబంధించి.. పబ్లిక్ మీటింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. కాగా, ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు జరిగే హైదరాబాద్ షెడ్యూల్లో కీలకమైన టాకీ పార్టు చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుందని సమాచారమ్. బాలీవుడ్ నటి కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments