'భరత్ అనే నేను' ఆడియో రైట్స్.. ఆ సంస్థకే
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమంతుడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
`భరత్ అనే నేను` పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్‌ని ప్రముఖ ఆడియో కంపెనీ లహరి మ్యూజిక్ సొంతం చేసుకుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో మహేష్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన `1 నేనొక్కడినే` చిత్రం ఆడియో కూడా లహరి సంస్థ ద్వారానే విడుదలైంది.
ఏప్రిల్ 27న సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానున్న ఈ సినిమాలో.. మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో సందడి చేయనున్నారు. విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ కొరటాల ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారని సమాచారమ్.
కథానాయకుడిగా మహేష్ నటిస్తున్న 24వ చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments