'భరత్ అనే నేను' ఆడియో రైట్స్.. ఆ సంస్థకే

  • IndiaGlitz, [Friday,December 01 2017]

శ్రీ‌మంతుడు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

'భ‌ర‌త్ అనే నేను' పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్‌ని ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ల‌హ‌రి మ్యూజిక్ సొంతం చేసుకుందని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గ‌తంలో మ‌హేష్‌, దేవిశ్రీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన '1 నేనొక్క‌డినే' చిత్రం ఆడియో కూడా ల‌హ‌రి సంస్థ ద్వారానే విడుద‌లైంది.

ఏప్రిల్ 27న స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా విడుద‌ల కానున్న ఈ సినిమాలో.. మ‌హేష్‌ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు. విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఎత్తిచూపుతూ కొర‌టాల ఈ చిత్రాన్ని త‌నదైన శైలిలో తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచార‌మ్‌.

క‌థానాయ‌కుడిగా మ‌హేష్ న‌టిస్తున్న 24వ చిత్ర‌మిది.

More News

విశాల్ కోసం ధనుష్ పాట

తమిళ చిత్రాల కథానాయకుడు ధనుష్.. బహుముఖప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా గానం, నిర్మాణం, దర్శకత్వం.. వంటి విభాగాల్లోనూ రాణించారు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో.

వైజాగ్ లో 'హలో' ఆడియో

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘అఖిల్’ ఆశించిన ఫలితం సాధించలేదు. ప్రస్తుతం.. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తన రెండో చిత్రాన్ని చేస్తున్నాడీ యువ కథానాయకుడు. ఆ సినిమానే ‘హలో’.

దిల్ రాజు.. ఏడు సినిమాలు?

2017 దిల్ రాజుకి బాగా కలిసొచ్చిన సంవత్సరమనే చెప్పాలి. ఈ సంవత్సరం ఆరంభంలో 'శతమానం భవతి' తో హిట్ ని అందుకున్నారు. తర్వాత వరుసగా 'నేను లోకల్', 'దువ్వాడ జగన్నాధం', 'ఫిదా', 'రాజా ది గ్రేట్', 'ఎం.సి.ఎ.'.. ఇలా సుమారు రెండు నెలలకి ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారు దిల్ రాజు.

కీర్తి సురేష్‌.. అత‌నితో మ‌రోసారి

'మెర్సల్' (అదిరింది) సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు త‌మిళ క‌థానాయ‌కుడు విజయ్. ప్ర‌స్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని.. త‌న‌కి ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చిన ఎ.ఆర్.మురుగదాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.

'హాథీ మేరే సాథీ' అంటున్న రానా

రానా దగ్గుబాటి.. ఏనుగులతో స్నేహం చేస్తున్నారు. 'హాథీ మేరే సాథీ' అనే సినిమాలో నటిస్తున్నారు. అదేంటి.. ఇది పాత హిందీ సినిమా క‌దా అనుకుంటున్నారా! నిజమే 1971లో రాజేష్ ఖన్నా, తనూజా హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమాకి ఇది రీమేక్.