'భరత్ అనే నేను' ఆడియో రైట్స్.. ఆ సంస్థకే

  • IndiaGlitz, [Friday,December 01 2017]

శ్రీ‌మంతుడు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

'భ‌ర‌త్ అనే నేను' పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్‌ని ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ల‌హ‌రి మ్యూజిక్ సొంతం చేసుకుందని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గ‌తంలో మ‌హేష్‌, దేవిశ్రీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన '1 నేనొక్క‌డినే' చిత్రం ఆడియో కూడా ల‌హ‌రి సంస్థ ద్వారానే విడుద‌లైంది.

ఏప్రిల్ 27న స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా విడుద‌ల కానున్న ఈ సినిమాలో.. మ‌హేష్‌ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు. విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఎత్తిచూపుతూ కొర‌టాల ఈ చిత్రాన్ని త‌నదైన శైలిలో తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచార‌మ్‌.

క‌థానాయ‌కుడిగా మ‌హేష్ న‌టిస్తున్న 24వ చిత్ర‌మిది.