Bharateeyudu2:‘భారతీయుడు 2’ నుంచి ‘తాతా వస్తాడే’ అంటూ ఊపు తెప్పించే పాట విడుదల

  • IndiaGlitz, [Friday,June 07 2024]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఇది వరకు విడుదల చేసిన శౌర సాంగ్ అందరికీ తెలిసిందే. ఆ పాటతో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.

చైన్నైలో ఈ మధ్యే జరిగిన ఆడియో లాంచ్ వేడుకలో చిత్రయూనిట్ మాట్లాడిన మాటలు, అనిరుధ్ ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్‌లు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే బీట్‌ను రిలీజ్ చేశారు. మాస్‌కు కిక్కిచ్చేలా తాతా వస్తాడే.. అదరగొట్టి పోతాడే అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.

కాసర్ల శ్యామ్ సాహిత్యం, అరుణ్ కౌండిన్య గాత్రం, అనిరుధ్ బాణీ ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాయి. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ, కంపోజ్ చేసిన మాస్ స్టెప్పులు బాగున్నాయి. త్వరలోనే భారతీయుడు 2 ట్రైలర్ రాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ క్రమంలో ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు శంకర్ భారీ ప్లాన్స్ వేసినట్టుగా కనిపిస్తోంది.

‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

న‌టీన‌టులు: క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌: ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌: హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు: శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌: కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ : లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌: రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌: సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌.