అభిమానుల ఆధ్వర్యంలో భరత్ అనే నేను వంద రోజుల వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమండ్రి అశోక దియేటర్ లో నగర సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానుల ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వంద రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు , మహేష్ బాబు బాబాయ్ , పద్మాలయా అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ( బంగారయ్య ) కేక్ కట్ చేసారు .
ఈ సందర్భంగా తు.గో జిల్లా చిత్ర పంపిణిదారుడు భరత్ చౌదరి మరియు అశోక థియేటర్ యజమాని రాజబాబు లకు వంద రోజుల షీల్డ్ అందజేశారు. ముఖ్యఅతిథి బంగారయ్య గారిని అభిమానులు గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ముగ్గురు వికలాంగులకు వీల్ చైర్ లను అందజేశారు. దియేటర్ సిబ్బందికి వంట కుక్కర్స్ ను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు బాణాసంచా కాల్చి తమ ఆనందం వ్యక్తం జేశారు . మాజీ ఏపీఐఐసి చైర్మన్ శ్రీకాకుళపు శివరామసుబ్రమణ్యం , సురేష్ మూవీస్ లీజ్ దారుడు రమేష్ బాబు చేతులమీదుగా హీరో మహేష్ బాబు షీల్డ్ ను బంగారయ్య గారికి అందజేశారు .
ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా ఎంతో ప్రతిభ చూపించిన మహేష్ బాబు రాజకుమారుడిగా హీరోగా పరిచయమై మురారి ఒక్కడు పోకిరి దూకుడు లతో సూపర్ స్టార్ స్టార్ డమ్ సంపాదించుకొని అభిమాన , ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న శ్రీమంతుడిగా , భరత్ అనే నేను ఒక రాజకీయ సంచలన చిత్రంగా ఘన విజయంసాధించడం చాలా సంతోషంగా ఉందని , వైవిధ్యమైన దర్శకులు నిర్మాతలను ఎన్నుకొంటూ మహేష్ బాబు అభిమానులను ఎప్పటికి వారి కోరిక మేరకు సంతృప్తి పరుస్తాడని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అభిమానులు ప్రభు నాయుడు , హరిబాబు , షాజహాన్ , నల్లరాజు , తనుజ్ , కేబుల్ సతీష్ లతో పాటు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు దిద్ది రాంబాబు , గండపనేని జితేందర్ కుమార్ , కర్రి మోహన్ బాబు , వియజయనగరం హుస్సేన్ , వెంకరమణరాజు , ఏలూరు నాని , సైమన్ , తిరుపతి మధు , నంద్యాల ఈపూరి రాజశేఖర్ , కర్నూల్ అహ్మద్ , సూర్యాపేట శ్రీకాంత్ , నల్గొండ కిరణ్ భోగ , విజయవాడ శీరం బుజ్జి , , తాడి శివ , నిర్మల్ మూట గంగాధర్ , అమలాపురం నర్సిహ్మం , పిఠాపురం బాబ్జి , వైజాగ్ కమల్ కుమార్ , మురళీకృష్ణ తదితర అభిమానులు పాల్గొని తమ ఆనందం వ్యక్తం చేసారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని థియేటర్ కళామందిర్ లో పట్టణ కృష్ణ మహేష్ యువత, హెల్పింగ్ పుపిల్స్ సొసైటీ E శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ "మహేష్ బాబు" నటించిన 'భరత్ అనే నేను' చిత్రం 100 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ముఖ్య అతిధులుగా చంటి (విజయవాడ), దర్శి సురేష్ (నెల్లూరు), సుబ్బా రాజు (భీమవరం) గార్లు విచ్చేసారు. థియేటర్ లీజ్ ప్రొప్రయిటర్ రవి కుమార్ గారికి 100 రోజుల షీల్డ్ బహుకరించారు. అనంతరం 100 కేజీల భారీ కేక్ కట్ చేసి, థియేటర్ స్టాఫ్ కి బట్టల పంపిణి చేసి, విచ్చేసిన అభిమానులకు విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి కృష్ణ మోహన్ లొల్ల, దుర్గ రావు, భువన్, సాయి సాకేత్ (విజయవాడ ), కోట శేష గిరి, మాదాల నరేంద్ర,(గుంటూరు), ఖమ్మం తోట రంగారావు , గుమ్మడి బ్రదర్స్ (రేపల్లె), దొప్పలపూడి శివ (తెనాలి), నవీన్ దామెర్ల. గణేష్ (మంగళగిరి), శివాజీ (గుడివాడ), కర్ణాటక ముళబలగల్ శ్రీనివాస రావు , నరసారావు పేట, సతేనపల్లి, చీరాల, ఒంగోలు, కడప, పొదిలి, ప్రొద్దుటూరు, కావలి, గిద్దలూరు, యర్రగొండపాలెం, ఖమ్మం, సూర్యాపేట, మఠంపల్లి, బందర్, మరియు కర్ణాటక, ఒరిస్సా, తెలంగాణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments