భరతవర్ష క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

భరతవర్ష క్రియేషన్స్‌ పతాకంపై నూతన నటీ నటులతో చెన్నకుని శెట్టి(కుమార్‌) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్రం పూజా కార్య క్రమాలు ఫిలింఛాంబర్‌లో జరిగాయి. దర్శకులు సము ద్ర, తెలoగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామ కృష్ణ గౌడ్‌, సెక్రటరీ సాయి వెంకట్‌, జి.వి.ఆర్‌ 4 మ్యూ జిక్‌ అధినేత వి. గోపాలకృష్ణ, మురళీ తదితలు పాల్గొన్నారు.

ప్రముఖ దర్శకులు సముద్ర మాట్లాడుతూ.. సరి కొత్త ఆలోచనలతో.. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ టీం రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది.

తెలoగాణ ఫిలించాంబర్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ మరియు సాయివెంకట్‌ మాట్లాడుతూ... ఈ మూవీ దర్శకుడు మంచి టాలెంటెడ్‌గా కనిపిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం విజయోత్సవ సభను జరుపుకునే దాకా వెళుతుందనే నమ్మకం ఉంది. మంచి అభిరుచి ఉన్న టీంలా కనపడుతున్నారు. నా సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుంది అన్నారు.

దర్శకుడు చెన్నకునిశెట్టి (కుమార్‌) మాట్లాడుతూ.. మైథలాజికల్‌ సస్పెన్స్‌ థ్ల్రిర్‌గా తెరకెక్కెనున్న ఈ చిత్రంలో నూతన నటీ నటులతో పాటు పాపులర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ లు సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వర్క్‌ చెయనున్నారు. వినోదం పాటు, విస్మయానికి గురి చేసే కథాంశమిది. త్వరలోనే చిత్రీకరణను ప్రారంభించనున్నామన్నారు.

జి.వి.ఆర్‌ 4 మ్యూజిక్‌ అధినేత వి. గోపాలకృష్ణ మాట్లాడుతూ.. టీం అందరి సమష్టి కృషితో ఈ చిత్రం అందరినీ అకట్టుకునే రీతిలో తెరకెక్కుతుందని బలoగా నమ్ముతున్నాం. కొత్త ట్రెండ్‌ను సృష్టించే అన్ని అంశాలు మా స్క్రిప్ట్‌లో ఉన్నాయి అన్నారు.

భరతవర్ష క్రియేషన్స్‌ బ్యానర్‌లో తొలి చిత్రంగా తెరకెక్కే ఈ చిత్రం టీమ్‌ అందరికీ మంచి పేరును తీసుకురావాలని అతిథులు, చిత్ర యూనిట్‌ సభ్యులు ఆకాంక్షించారు.

More News

'టచ్ చేసి చూడు' సెన్సార్ పూర్తి ...ఫిబ్రవరి 2న విడుదల

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'టచ్ చేసి చూడు'.

సాయిపల్లవి చిత్రాలు ఒకే రోజున..

ఫిదా చిత్రంతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలర్ బ్యూటీ సాయి పల్లవి.

కృష్ణకుమారి మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం

అలనాటి మేటి తార కృష్ణకుమారి నేడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రామారావుగారు ఎన్.ఏ.టి సంస్థలో తొలిసారి స్వయంగా నిర్మించిన 'పిచ్చి పుల్లయ్య'(1953)తో సహా దాదాపు పాతిక సినిమాల్లో కృష్ణకుమారి నాన్నగారి సరసన కథానాయికగా నటించారు.

అక్కినేని హీరోతో 'నిన్నుకోరి' దర్శకుడు?

తొలి చిత్రం 'నిన్నుకోరి'తో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ.

ఆగష్టు నుంచి యన్.టి.ఆర్ బయోపిక్

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యన్.టి.ఆర్’.