భరతవర్ష క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
భరతవర్ష క్రియేషన్స్ పతాకంపై నూతన నటీ నటులతో చెన్నకుని శెట్టి(కుమార్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం పూజా కార్య క్రమాలు ఫిలింఛాంబర్‌లో జరిగాయి. దర్శకులు సము ద్ర, తెలoగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామ కృష్ణ గౌడ్, సెక్రటరీ సాయి వెంకట్, జి.వి.ఆర్ 4 మ్యూ జిక్ అధినేత వి. గోపాలకృష్ణ, మురళీ తదితలు పాల్గొన్నారు.
ప్రముఖ దర్శకులు సముద్ర మాట్లాడుతూ.. సరి కొత్త ఆలోచనలతో.. యంగ్ అండ్ డైనమిక్ టీం రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది.
తెలoగాణ ఫిలించాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్ మరియు సాయివెంకట్ మాట్లాడుతూ... ఈ మూవీ దర్శకుడు మంచి టాలెంటెడ్‌గా కనిపిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం విజయోత్సవ సభను జరుపుకునే దాకా వెళుతుందనే నమ్మకం ఉంది. మంచి అభిరుచి ఉన్న టీంలా కనపడుతున్నారు. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అన్నారు.
దర్శకుడు చెన్నకునిశెట్టి (కుమార్) మాట్లాడుతూ.. మైథలాజికల్ సస్పెన్స్ థ్ల్రిర్‌గా తెరకెక్కెనున్న ఈ చిత్రంలో నూతన నటీ నటులతో పాటు పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చెయనున్నారు. వినోదం పాటు, విస్మయానికి గురి చేసే కథాంశమిది. త్వరలోనే చిత్రీకరణను ప్రారంభించనున్నామన్నారు.
జి.వి.ఆర్ 4 మ్యూజిక్ అధినేత వి. గోపాలకృష్ణ మాట్లాడుతూ.. టీం అందరి సమష్టి కృషితో ఈ చిత్రం అందరినీ అకట్టుకునే రీతిలో తెరకెక్కుతుందని బలoగా నమ్ముతున్నాం. కొత్త ట్రెండ్‌ను సృష్టించే అన్ని అంశాలు మా స్క్రిప్ట్‌లో ఉన్నాయి అన్నారు.
భరతవర్ష క్రియేషన్స్ బ్యానర్‌లో తొలి చిత్రంగా తెరకెక్కే ఈ చిత్రం టీమ్ అందరికీ మంచి పేరును తీసుకురావాలని అతిథులు, చిత్ర యూనిట్ సభ్యులు ఆకాంక్షించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com