Bharat Rice:రూ.29లకే 'భారత్ రైస్' విక్రయాలు ప్రారంభం.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..?

  • IndiaGlitz, [Tuesday,February 06 2024]

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ తక్కువ ధరలకే బియ్యం అందించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 'భారత్ రైస్'(Bharat Rice) పేరిట రూ.29లకే కిలో బియ్యం నేటి నుంచి విక్రయించనుంది. కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

తొలి విడతలో నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NCCF) సహా రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా అమ్మకాలు జరపనుంది. ఈ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో తీసుకువచ్చారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వేదికల్లో విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్‌ రైస్‌కు అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

ఈ 'భారత్ రైస్' బ్యాగులు కావాలనుకునే ప్రజలు https://www.nafedbazaar.com/product-tag/online-shopping వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇక్కడ భారత రైస్‌తో పాటు పప్పు, శనగపిండి వంటి ఇతర ఉత్పత్తులు కూడా ఉంటాయి. ఇక్కడే కాకుండా ఇతర ఈ-కామర్స్ సైట్లలో నుంచి కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. మార్కెట్లో కంటే సగం ధరకే నాణ్యమైన బియ్యం అందిస్తుండటంతో వినియోగదారుల నుంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ డిమాండ్‌కు తగ్గట్లు దేశంలో బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో వివరాలు ప్రకటించాలని ట్రేడర్లను ఆదేశించింది. తొలి దశలో 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ రిటైల్ మార్కెట్ కోసం కేటాయించింది.

More News

Hanuman:'హనుమాన్' మరో రికార్డ్.. 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'హనుమాన్' చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

AP Assembly:హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ సభ్యులు సస్పెన్షన్..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా సాగాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడంతో వారిని సభాపతి తమ్మినేని సీతారాం

BRS:బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ..

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Rama Jogaiah: చంద్రబాబుకు అధికారం అప్పగించడమే మీ లక్ష్యమా..? పవన్‌కు జోగయ్య ఘాటు లేఖ..

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి.

Balka Suman: రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదు.. బాల్క సుమన్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి రెచ్చిపోయారు.