ప్రణబ్‌కు భారతరత్న.. ఎన్టీఆర్‌కు మళ్లీ మొండిచెయ్యే!
Send us your feedback to audioarticles@vaarta.com
‘భారతరత్న’ పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఈ గౌరవం చిత్రసీమతో పాటు రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన అన్న నందమూరి తారకరామారావుకు ఇచ్చి తీరాల్సిందేనని గత కొన్నేళ్లుగా తెలుగు తమ్ముళ్లు, పలువురు ప్రముఖులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2019 రిపబ్లిక్ డే వేడుకలకు ముందు కచ్చితంగా ఎన్టీఆర్ పేరు ఉంటుందని అందరూ భావించారు కూడా. తాజా ప్రకటనలో కూడా ఎన్టీఆర్ పేరు లేకపోవడం గమనార్హం. దీంతో మరోసారి అన్నగారికి ‘మొండి చెయ్యి’ చూపినట్లైంది.
తాజాగా.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఈ ‘భారతరత్న’ వరించింది. ఆయనతో పాటు సామాజిక కార్యకర్త చాందికాదాస్ అమృత్‌రావ్ (మరణాంతరం), గాయకుడు భూపేన్ హజారికా (మరణాంతరం)లకు అత్యున్నత పురస్కారం ఇస్తున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. వీరందరూ రిపబ్లిక్ డే జనవరి 26న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాల బహుకరణ జరగనుంది.
ఇదిలా ఉంటే .. అన్నగారికి భారతరత్న ఇవ్వకపోవడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతీ ఏటా డిమాండ్ చేస్తున్నప్పటికీ కనీసం ఈ వ్యవహారంపై సంబంధిత కమిటీ నుంచి ఒక్కసారి కూడా స్పందన లేకపోవడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout